భారత వాయుసేన కేంద్రాల్లో హైఅలర్ట్
- October 02, 2019
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న భారత వాయుసేన కేంద్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 10 మంది ఆత్మాహుతి దళ సభ్యులు భారత వాయుసేన ప్రధాన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడవచ్చంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. బాలాకోట్ ఉగ్రవాద స్థావరం పునఃప్రారంభమైందని, పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు సరిహద్దు వద్దకు చేరుకుంటున్నారని ఇటీవలే ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో, భారత నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
బాలాకోట్ దాడులకు ప్రతీకారంగా జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లోని శ్రీనగర్, అమృత్ సర్ హిండన్, అవంతిపూర్ వంటి కీలక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ లపై ఆత్మాహుతి దాడులు చేపట్టాలని జైషే మహ్మద్ పక్కా ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్రానికి సమాచారం అందింది. దాంతో, భారత వాయుసేన కేంద్రాల వద్ద భద్రత రెట్టింపు చేయడంతో పాటు, అక్కడి పాఠశాలలను కూడా మూసివేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!