డీడీ అసిస్టెంట్ డైరెక్టర్‌పై మోడీ వేటు
- October 03, 2019
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని నిర్లక్ష్యం చేసిన దూరదర్శన్ చానల్ అసిస్టెంట్ డైరెక్టర్‌పై వేటు పడింది. వివరాల్లోకి వెళితే..ప్రధాని నరేంద్ర మోదీ గత నెల 30న ఐఐటీ మద్రాస్‌లో నిర్వహించిన కన్వెన్షన్ ప్రోగ్రాంలో ఇచ్చిన ప్రసంగాన్ని చెన్నై దూరదర్శన్ విభాగమైన డీడీ పొథిగై ప్రత్యక్ష ప్రసారం చేయలేదు.
దీంతో ఆ చానల్ అసిస్టెంట్ డైరెక్టర్‌పై వేటు పడింది. ఉన్నతాధికారుల అనుమతి ఉన్నపటికీ మోదీ ప్రసంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని ప్రధాని కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖను కోరింది. దీంతో డీడీ పొథిగై అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ వసుమతిని ప్రసారభారతి సస్పెండ్ చేసి మోదీ ప్రసంగాన్ని ఎందుకు ప్రత్యక్ష ప్రసారం చేయలేదో వివరణ కోరింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!