రస్‌ అల్‌ ఖైమాలో యూఏఈ మిలిటరీ రిహార్సల్స్‌

- October 05, 2019 , by Maagulf
రస్‌ అల్‌ ఖైమాలో యూఏఈ మిలిటరీ రిహార్సల్స్‌

యూఏఈ ఆర్‌మమడ్‌ ఫోర్సెస్‌, రస్‌ అల్‌ ఖైమాలోని అల్‌ హమ్రా ప్రాంతంలో మిలటరీ రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు భారీగా శబ్దాలు వచ్చే అవకాశం వుందంటూ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. 6వ ఎడిషన్‌ ఆఫ్‌ యూనియన్‌ ఫోర్ట్రెస్‌లో భాగంగా ఈ మిలటరీ ఎక్సర్‌సైజ్‌లు నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు ఈ రిహార్సల్స్‌ కొనసాగుతాయి. రిహార్సల్స్‌ జరుగుతున్న ప్రాంతానికి అతి దగ్గరగా రాకూడదనీ, ఫొటోలు తీసేందుకు ప్రయత్నించవద్దని, సముద్రం వైపు నుంచి అస్సలు రాకూడదని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఓ హెచ్చరికని కూడా జారీ చేయడం జరిగింది. హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, స్పీడ్‌ బోట్లు వంటివి ఈ రిహార్సల్స్‌లో పాల్గొననున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com