ఆర్.ఆర్.ఆర్ టైటిల్: రామ రౌద్ర రుషితం
- October 06, 2019
జక్కన్న దర్శకత్వంలో మరో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కొమరం భీంగా తారక్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్న ఈ సినిమా 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే 3 షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా నాల్గవ షెడ్యూల్ షూటింగ్ రామోజి ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ అబ్రివేషన్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ అన్ని భాషలకు సెపరేట్ టైటిల్ ఉంటుందని రాజమౌళి అప్పుడే చెప్పాడు. చెప్పినట్టుగానే తెలుగులో ఆర్.ఆర్.ఆర్ కు రామ రౌద్ర రుషితం అని ఫిక్స్ చేశారట.
ఇతరభాషలలో ఈ చిత్రం టైటిల్ రైజ్ రివోల్ట్ రివెంజ్ అని పెట్టబోతున్నారట. టైటిల్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మరో బాహుబలి కాదు కాదు అంతకుమించే సినిమా చేస్తాడని అనుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సినిమాపై తెలుగు సినిమా ఆధిపత్యం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మరోసారి తెలుగు సినిమా సత్తా చాటేలా చూస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో రాం చరణ్, ఎన్.టి.ఆర్ ఒకరిని మించి ఒకరు తమ నట విశ్వరూపం చూపించేలా ఉన్నారు. సినిమాకు కీరవాణి మ్యూజిక్ కూడా బలం కానుంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొదలుపెడుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ మరోసారి తెలుగు సినిమా స్టామినా చాటిచెప్పే సినిమా అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాపై ఎలాంటి క్లూస్ బయటకు రాకుండా అంచనాలు పెంచుతున్నారు రాజమౌళి. అక్టోబర్ 22న కొమరం భీం జయంతి సంద్ర్భంగా తారక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







