ఫ్రాన్స్ కు బయలుదేరిన రాజ్‌నాథ్ సింగ్
- October 07, 2019
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం కొద్దిసేపటి క్రితమే ఫ్రాన్స్ కు బయలుదేరారు. ఫ్రాన్స్ నుంచి భారత వాయుసేన కొనుగోలు చేస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో తొలి విమానాన్ని స్వీకరించడానికి రాజ్‌నాథ్ సింగ్ ఈ పర్యటన చేపట్టారు. భారత వాయుసేన ఆవిర్భావ దినోత్సవమైన అక్టోబర్ 8 న ఫ్రాన్స్, భారత్ కు తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందజేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొని, తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకుంటారు. రాఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్‌కు చెందిన అధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏటా సంప్రదాయబద్ధంగా జరుపుకునే 'ఆయుధ పూజ' ను కూడా రాజ్‌నాథ్ తన పర్యటన సందర్భంగా ఫ్రాన్స్‌లో జరుపుకొంటారు. రాఫెల్ యుద్ధ విమానంలో కొద్దిసేపు విహరిస్తారు. ఫ్రాన్స్ ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన ఉన్నత స్థాయి నేతలతో రాజ్‌నాథ్ ఈ నెల 9 న సమావేశమవుతారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారం బలోపేతంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







