రాజుగారి గది 3 ఫస్ట్ లుక్ & విడుదల తేదీ
- October 08, 2019యాంకర్ గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్..రాజు గారి గది చిత్రంతో డైరెక్టర్ గా సత్తా చాటి వార్తల్లో నిలిచాడు. హర్రర్ కు కామెడీ మిక్స్ చేసి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత దీనికి సీక్వెల్ తీసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా దీనికి మూడో పార్ట్ గా రాజు గారి గది 3 తెరకెక్కిస్తున్నారు.
మొదట రెండు చిత్రాలలో పూర్ణ, సమంత నటించగా ఈ మూడవ చిత్రంలో అవికా గౌర్ నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ అక్టోబర్ 18 న రిలీజ్ చేస్తున్నట్లు దసరా లుక్ తో తెలిపారు. దసరా పోస్టర్ లో చుట్టుముట్టిన దెయ్యాల మధ్యలో అశ్విన్ ఎంతో ధీమాగా ధైర్యంగా కనిపిస్తున్నాడు. మెరూన్ కలర్ సిల్కు చొక్కాయ్.. తెల్ల జెరీ పంచెలో ఆ కాలం రొమాంటిక్ పిల్ల జమీందార్ ని తలపిస్తున్నాడు. దెయ్యాల మధ్యలో ఉన్నా రొమాంటిక్ యాంగిల్ మాత్రం ఆ కళ్లలో హైలైట్ గా కనిపిస్తోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ