రస్‌ జువాయెద్‌లో యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ ప్రారంభం

రస్‌ జువాయెద్‌లో యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ ప్రారంభం

బహ్రెయిన్‌: వినియోగదారులు తమ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కోసం ఇకపై రస్‌ జువాయెద్‌లోని యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ కొత్త బ్రాంచ్‌ని సందర్శించవచ్చు. మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ అండర్‌ సెక్రెటరీ అహ్మద్‌ జఫ్ఫార్‌ అల్‌ హైకి ఈ యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ - రస్‌ జువాయెద్‌ బ్రాంచ్‌ని ప్రారంభించారు. యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ - బహ్రెయిన్‌ కంట్రీ హెడ్‌ ఆకాష్‌ నైన్వాల్‌, వినియోగదారులు, యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కొత్త బ్రాంచ్‌ ప్రారంభంతో బహ్రెయిన్‌లో వున్న యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ బ్రాంచీల సంఖ్య 12కి చేరుకుంది. వినియోగదారులకు మెరుగైన సేవల్ని అందించడమే లక్ష్యంగా తమ శాఖల్ని విస్తరిస్తున్నామని నైన్వాల్‌ పేర్కొన్నారు.

 

Back to Top