గల్ఫ్‌ సిటిజన్‌పై దాడి: నలుగురి అరెస్ట్‌

గల్ఫ్‌ సిటిజన్‌పై దాడి: నలుగురి అరెస్ట్‌

కువైట్‌ సిటీ: జహ్రా పోలీస్‌, నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. గల్ఫ్‌ దేశస్తుడైన ఓ వ్యక్తిని సులైబియాలోని అతని ఇంటి ముందు నిందితులు విచక్షణారహితంగా కొట్టారు, కత్తితో పొడిచేందుకు కూడా ప్రయత్నించారు. సెక్యూరిటీ ఫోర్సెస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుల్లో ఓ వ్యక్తి బాధితుడ్ని పొడిచి చంపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కాగా, తనపై దాడి చేసినవారిలో ఓ వ్యక్తిని గుర్తుపట్టగలననీ, మిగతా నలుగురి నిక్‌నేమ్స్‌ మాత్రమే తనకు తెలుసని బాధితుడు పోలీసులకు తెలిపాడు. మెడికల్‌ రిపోర్ట్స్‌తో నిందితుడిపై దాడి జరిగినట్లు తేటతెల్లమైంది. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.  

 

Back to Top