ఎయిర్ ఫోర్స్ వన్ : మోడీ కోసం రెండు ప్రత్యేక విమానాలు

ఎయిర్ ఫోర్స్ వన్ : మోడీ కోసం రెండు ప్రత్యేక విమానాలు

 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం రెడీ అవుతున్న రెండు సరికొత్త ప్రత్యేక విమానాలు వచ్చే ఏడాది జూన్ నాటికి ఢిల్లీ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బోయింగ్ కంపెనీ ఈ రెండు ప్రత్యేక విమానాలను డల్లాస్ ఫెసిలిటీలో రెడీ చేస్తోంది. అయితే ఈ రెండు సుదూర బోయింగ్ 777-300ER ప్రత్యేక విమానాలు ఎయిర్ ఇండియా ఆధీనంలో కాకుండా ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF)ఆధీనంలో ఉండనున్నట్లు,ఈ మేరకు ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నట్లు సౌత్ బ్లాక్ కి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు తెలిపారు.

ఈ రెండు విమానాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వీటిని ఎయిర్ ఫోర్స్ వన్ అని పిలవనున్నారు. మిస్సైళ్లను సైతం తట్టుకోగల శక్తి వీటికి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వాడుతున్న బోయింగ్ 747-200B టెక్నాలజీనే వీటి తయారీకి ఉపయోగిస్తున్నారు. చాలా సెక్యూర్ గా,క్షిపణి రక్షణ వ్యవస్థలతో ఇవి రెడీఅవుతున్నాయి.190మిలియన్ డాలర్లను ఈ విమానాల కోసం ఖర్చు చేస్తున్నారు.రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,ప్రధానమంత్రి ఈ ప్రత్యేక విమానాన్ని ఉపయోగించనున్నారు.

తరచూ విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానాన్ని ఉపయోగించే రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,ప్రధానమంత్రిల కోసం అంకితం చేయబడుతున్న మొట్టమొదటి విమానంగా ఇది నిలవనుంది. అంతేకాకుండా బోయింగ్ 777 విమానం స్పెషల్ ప్రొటెక్షన్ సూట్ కలిగివున్న మొట్టమొదటి భారతీయ విమానం, ఇది శత్రువు రాడార్ ఫ్రీక్వెన్సీస్ ను జామ్ చేయగలదు, వేడిని కోరుకునే క్షిపణులను మళ్లించగలదు. సిబ్బంది జోక్యం లేకుండా అధునాతన ఇంటర్మీడియట్ రేంజ్ క్షిపణి వ్యవస్థలను అడ్డగించగలదు.

Back to Top