ఎల్ఐసి పాలసీదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు... సంస్థపై ఆ ప్రచారం అసత్యం
- October 10, 2019.svg_1570686829.jpg)
భారతీయ జీవిత బీమా సంస్థ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పాలసీదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా బీమా రంగ సంస్థల్లో అగ్ర గామిగా ఉంటూ ఎక్కువ పాలసీదారులు కలిగిన భీమా సంస్థగా పేరుపొందింది ఎల్ ఐ సి. కొత్త కొత్త బీమా పాలసీ సంస్థలు ఎన్ని పుట్టుకు వచ్చినప్పటికీ ఎల్ఐసి బ్రాండ్ మాత్రం మారలేదు. పాలసీదారులకు ఎక్కువ నమ్మకం కలిగిన భీమా సంస్థ ఏది అంటే అది ఎల్ఐసి అనే చెప్పవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా ఎల్ఐసి ఆర్థికంగా బలహీన పడిందని... సంస్థ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని పాలసీదారుల పాలసీలకు భద్రత లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఈ ప్రచారం తో పాలసీ దారులు ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసి సంస్థ పై వస్తున్న వార్తలను ఎల్ఐసి సంస్థ ఖండించింది. ఎల్ఐసి సంస్థ నష్టాల్లో ఉందని ఎల్ఐసి ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది అని వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పేసింది సంస్థ. పాలసీదారుల్లో ఆందోళన రేకెత్తింప చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం జరుగుతున్నట్లు సంస్థ వెల్లడించింది. పాలసీదారుల సొమ్ము సంస్థలో భద్రంగా ఉందని పాలసీదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సంస్థ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడిందని స్పష్టం చేసింది.
ఈ ఏడాది మార్చి చివరికి మార్కెట్ వాటా ప్రీమియం పరంగా 66.24 శాతం ఉండగా ఆగస్టు 31 నాటికి 73.06 శాతానికి పెరిగిందని ఎల్ఐసి సంస్థ గుర్తు చేసింది. ఎల్ఐసి సంస్థ ఆర్థిక పరిస్థితి ఇంతకు ముందు కంటే మెరుగు పడింది కాబట్టి మునుపెన్నడూ లేని విధంగా పాలసీదారులకు 50 వేల కోట్లను బోనస్ గా సంస్థ ప్రకటించిందని... దీన్నిబట్టే సంస్థ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఎల్ఐసి సంస్థ తెలిపింది. ఎల్ఐసి సంస్థపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మి పాలసీదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు స్పష్టం చేసింది. 2019 ఆగస్టు 31 నాటికి ఎల్ఐసి సంస్థ యొక్క మార్కెట్ వాటా పాలసీల పరంగా 72.84 శాతంగా ఉండగా... ప్రీమియం పరంగా చూస్తే ఎల్ఐసి వాటా 73.06 శాతంగా ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!