మద్యం మత్తులో 12 వాహనాల్ని ఢీకొట్టిన ఆసియా వలసదారుడు

- October 10, 2019 , by Maagulf
మద్యం మత్తులో 12 వాహనాల్ని ఢీకొట్టిన ఆసియా వలసదారుడు

కువైట్‌ సిటీ: ఫర్వానియా సెక్యూరిటీ మెన్‌, ఆసియా వలసదారుడొకర్ని అరెస్ట్‌ చేశారు. మద్యం మత్తులో వున్న నిందితుడు, ఖైతాన్‌ ప్రాంతంలో ఓ జీప్‌ని 12 ఇతర వాహనాల్నీ ఢీ కొన్నాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఖేతాన్‌ ఏరియా బ్లాక్‌ 10లో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులోనే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపిన పోలీసులు, ఏరియా పోలీస్‌ స్టేషన్‌కి నిందితుడ్ని అప్పగించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com