Raymond: 700రూపాయల కోట్ల విలువైన స్థలం అమ్మకం
- October 10, 2019
ప్రఖ్యాత టెక్స్‌టైల్ ఇండస్ట్రీ రేమండ్స్ లిమిటెడ్ ఆస్తులు అమ్మకానికి పెట్టింది. ముంబైలోని థానెలో ఉన్న రూ.700కోట్ల విలువైన 20ఎకరాల స్థలాన్ని అమ్మేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గ్జాండర్ కొనేందుకు ముందుకు వచ్చింది. దీని అమ్మకంతో వచ్చిన డబ్బుతో రూ.17వందల కోట్ల పెట్టుబడి పెట్టాలని రేమండ్స్ భావిస్తుంది.
ఆ 20ఎకరాలకు ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకోవాలని భావిస్తున్న గ్జాండెర్ సంస్థ ఛైర్మన్ ఇలా మాట్లాడారు. ముంబై లాంటి మెట్రో పొలిటన్ మార్కెట్లో ఇటువంటి విలువైన స్థలాన్ని కొనుగోలు చేయడం కీలకం. ఇలాంటి అవకాశం కోసం సహనంతో ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నాం' అని వివరించారు.
థానెలో కొనుగోలు చేసిన స్థలంలో ఓ సారి కేంద్రాన్ని మొదలుపెడితే 20మిలియన్ కస్టమర్లు వచ్చిపోవడానికి వీలవుతుందని అంచనా. దీని ద్వారా 4వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని భావిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా రేమండ్స్ ఆ స్థలాన్ని టెక్స్‌టైల్ పరిశ్రమ కోసం వాడుతుంది.
ఈ టెక్స్‌టైల్ మిల్ రేమండ్స్ ఉత్పత్తులలో ప్రధానంగా ఉండేది. తొమ్మిదేళ్ల క్రితం మొదలుపెట్టిన మిల్లు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో ఒప్పందం కుదరక మూత పడింది. ఆ తర్వాత రేమండ్స్‌కు ల్యాండ్ డెవలప్‌మెంట్ కోసం క్లియరెన్స్ పొందింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!