ఇరాన్ ఇంధన ట్యాంకర్‌పై మిస్సైళ్ల దాడి !
- October 11, 2019
ఇరాన్‌కు చెందిన ఇంధన ట్యాంకర్ పేలింది. సౌదీ అరేబియాలోని జెడ్డాకు సమీపంలో ఉన్న తీరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇరాన్‌కు చెందిన నేషనల్ ఆయిల్ కంపెనీ ఓడ భారీ ఇంధనంతో వెళ్తుండగా.. మిస్సైళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. జెడ్డా పోర్టుకు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. భారీ రవాణా ఓడలో ఉన్న రెండు ప్రధాన చమురు స్టోరేజ్ ట్యాంక్‌లు తీవ్రంగా ధ్వంసమైనట్లు అంచనా వేస్తున్నారు. దీని వల్ల ఎర్ర సముద్రంలోకి చమురు లీకవుతోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలుకాలేదని ఇరాన్ వెల్లడించింది. ఓడను మిస్సైళ్లు ఢీకొట్టినట్లు ఆయిల్ కంపెనీ చెబుతున్నా.. దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం ఇంధన ట్యాంకర్ల నుంచి వెలుబడిన మంటలను ఆర్పినట్లు ఇరాన్ పేర్కొన్నది. సౌదీ, ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. గత నెలలో సౌదీ ఆరేబియాలో ఉన్న అతిపెద్ద చమురు క్షేత్రం ఆరామ్కోకు చెందిన రెండు భారీ స్టోరేజ్ కేంద్రాలపై మిస్సైళ్లు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడులకు ఇరాన్ కారణమని అమెరికా, సౌదీ దేశాలు చెప్పాయి. కానీ తమకు ఏమాత్రం సంబంధంలేదని ఇరాన్ కూడా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..