ఫ్లై దుబాయ్ విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- October 11, 2019
ఫ్లై దుబాయ్ విమానం బకు నుంచి దుబాయ్ వెళుతూ షిరాజ్ షాహిద్ దస్తాఘీమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (ఎస్‌వైజెడ్) - ఇరాన్ సౌత్ రీజియన్‌లో ఎమర్జన్సీ ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్యతోనే విమానం ఎమర్జన్సీ ల్యాండ్ అయినట్లు ఫ్లై దుబాయ్ అధికార ప్రతినిథి పేర్కొన్నారు. ప్రయాణీకులెవరికీ ఎలాంటి సమస్యలూ రాకుండా తగిన ఏర్పాట్లు చేశామని, షిరాజ్ ఎయిర్ పోర్ట్ నుంచి వారు తమ జర్నీని మరో ఫ్లై దుబాయ్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రయాణించారని ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందనీ, ఈ కారణంగా ప్రయాణీకులకు తలెత్తిన ఇబ్బందికి క్షమాపణలు చెబుతున్నామని సంస్థ పేర్కొంది. సాంకేతిక సమస్య ఏర్పడిన విమానం స్థానంలో మరో విమానాన్ని ఎస్‌వైజెడ్ విమానాశ్రయానికి పంపి, అక్కడి నుంచి ప్రయాణీకుల్ని దుబాయ్ తీసుకొచ్చినట్లు సంస్థ అధికార ప్రతినిథి చెప్పారు. సాంకేతిక సమస్యని పరిష్కరించిన వెంటనే ఆ విమానం కూడా దుబాయ్‌కి అదే రోజు చేరుకుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







