కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ: 'రంగమార్తాండ'
- October 17, 2019కృష్ణవంశీ ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడనీ, ఆ సినిమా కోసం ఆయన రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నాడనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. అయితే కృష్ణవంశీ ఏ సినిమా చేస్తున్నాడు? అది ఎప్పుడు మొదలుకానుంది? అనే విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉండిపోయింది. తాజాగా ఈ విషయానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. 2016లో వచ్చిన మరాఠీ సినిమా 'నటసామ్రాట్'కి రీమేక్ గా కృష్ణవంశీ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి 'రంగమార్తాండ' అనే టైటిల్ ను ఖరారు చేసి, అధికారిక పోస్టర్ ను వదిలాడు. మరాఠీలో నానాపటేకర్ చేసిన పాత్రలో ప్రకాశ్ రాజ్ .. ఆయన సరసన రమ్యకృష్ణ నటించనున్నారు. అభిషేక్ - మధు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. 'శ్రీఆంజనేయం' తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..