నీరసంగా వుందా. ఒక సీతాఫలం తీసుకోండి.!

- October 19, 2019 , by Maagulf
నీరసంగా వుందా. ఒక సీతాఫలం తీసుకోండి.!

నీరసంగా ఉన్నప్పుడు ఓ సీతాఫలం తింటే వెంటనే శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. కణజాల బలహీనతనీ, ఆస్తమానూ ఈ పండు తగ్గిస్తుందని వైద్యులు చెప్తున్నారు. సీతాఫలాల్లో అధికంగా ఉండే బి-విటమిన్, మెదడులో విడుదలయ్యే గాబా న్యూరాన్ అనే రసాయనాన్ని తగ్గిస్తుందట. ఫలితంగా ఒత్తిడి, చికాకులు తగ్గుతాయి. వీటిల్లో అధికంగా ఉండే విటమిన్-సి సహజ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఈ పండ్లలో అధికంగా ఉండే ఐరన్ రక్తహీనతని తగ్గిస్తుంది.

ముఖ్యంగా గర్భిణీలకు ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. గర్భస్థ శిశువు చర్మం, కళ్లు, జుట్టు పెరుగుదలకూ తోడ్పడతాయి. ఈ పండుని పటికబెల్లంతో కలిపి తింటే పాలిచ్చే తల్లులకు పాలు బాగా పడతాయి. అలాగే ఇందులోని నియాసిన్ చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకూ తోడ్పడుతుంది. అన్నింటికన్నా ఇందులో అధికంగా ఉండే కాపర్, థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి ఎంతో అవసరం. ఇది జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. గర్భిణులకూ కాపర్ ఎంతో అవసరం. నెలలు నిండకుండా ప్రసవించడాన్ని తగ్గిస్తుంది. వేవిళ్లతో బాధపడేవాళ్లకు వికారాన్నీ తగ్గిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com