ఒమన్‌లో పర్యటించనున్న బహ్రెయిన్ అండర్ 16 క్రికెట్ టీమ్
- October 19, 2019బహ్రెయిన్ అండర్ 16 నేషనల్ రకికెట్ టీమ్, ఒమన్‌లో జరగనున్న ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అండర్ 16 చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొననుంది. అక్టోబర్ 19 నుంచి 30 వరకు ఈ పోటీలు జరుగుతాయి. అఫీషియల్ టూర్ యూనిఫామ్స్, నేషనల్ క్యాప్స్‌ని క్రీడాకారులకు అల్బా క్లబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో అందజేశారు. క్రికెట్ బహ్రెయిన్ అసోసియేషన్ అధికారులు, స్పాన్సర్స్ మరియు ప్లేయర్స్ పేరెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిబిఎ సెక్రెటరీ జనరల్ యాసెర్ జాఫర్, క్యాప్స్‌ని ప్లేయర్స్‌కి అందించారు.స్పాన్సర్స్ అయిన రాయల్ బహ్రెయిన్ హాస్పిటల్, ఎక్సెలాన్ మరియు అల్ నమాల్ గ్రూప్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారాయన. అల్బా క్లబ్లో గత నాలుగు నెలలుగా యంగ్ క్రికెటర్స్‌కి శిక్షణ ఇవ్వడం జరిగింది. నేషనల్ కోచ్ అజీమ్ ఉల్ హక్ నేతృత్వంలో ఒమ్రాణ్ ఘని, తాహిర్ అన్సారీ, ప్రాచుర్ శుక్లా ఈ శిక్షణ ఇచ్చారు. బహ్రెయిన్ టూమ్, గ్రూప్ ఎలో వుంది.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు