విజయ్ సేతుపతి నిర్ణయాన్ని మెచ్చుకున్న గ్రామ ప్రజలు
- October 20, 2019
విజయ్ సేతుపతి రైతుల కోసం ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. విజయ్.తాజాగా 'లాభం' అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రజలకు మంచి మెసేజ్ స్టోరీలు తెరకెక్కించే సీనియర్ డైరెక్టర్ ఎస్.ఫై.జననాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ సందర్భంగా ఈ సినిమాలో రైతులకు సంబంధించిన భవనం అవసరమైంది. దీంతో చిత్ర యూనిట్ ఓ సెట్ వేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే అలాంటి సెట్ ఏం వద్దని నిజమైన రైతులు ఉండే ఊరులోనే చిత్రీకరణ జరుపుదామని విజయ్ సేతుపతి చెప్పారు. అలాగే అక్కడ రైతు సంఘం కోసం ఒక భవనం నిర్మించి అందులో షూటింగ్ చేద్దామని చిత్రయునిట్ కు చెప్పారు. ఇక షూటింగ్ పూర్తయ్యాక ఆ ఊరి ప్రజలకే భవనాన్ని అప్పగించాలని కోరారట. ఈ నిర్ణయంపై చిత్ర యూనిట్ విజయ్ సేతుపతిని అభినందించింది. అలాగే గ్రామ ప్రజలు కూడా కూడా హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!