నిరసన సెగలు..మెట్రో స్టేషన్లకు నిప్పు

- October 22, 2019 , by Maagulf
నిరసన సెగలు..మెట్రో స్టేషన్లకు నిప్పు

శాంటియాగో : చిలీలో ప్రజలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం రోజున మొదలైన నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో పలువురు మరణించగా.. ఆందోళన చేపడుతున్న వందలాది మందిని అరెస్ట్‌ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. మెట్రో చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. జనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వేల సంఖ్యలో ప్రజలు చిలీ రాజధాని శాంటియాగోలో ఆందోళనలకు దిగారు.

రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు మాస్క్‌లు ధరించి బీభత్సం సృష్టించారు. పలు చోట్ల బస్సులకు, మెట్రో స్టేషన్‌లకు, బ్యాంకులకు నిప్పు పెట్టారు. శాంటియాగోలో ఎక్కడ చూసిన మంటలు, దట్టమైన పొగలతో నిండిపోయింది. పలుచోట్ల నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అలాగే బారీగా భద్రతా బలగాలను మోహరించారు. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించడమే కాకుండా.. 15 రోజులపాలు ఎమర్జెన్సీ ప్రకటించింది. కాగా, చిలీలో నియంతృత్వ పాలన ముగిసిన తర్వాత ఇలాంటి హింసాత్మక ఆందోళన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com