భర్త వరుణ్‌కు వితిక షాక్.. బిగ్ బాస్ విన్నర్ ఆమేనట..
- October 22, 2019బిగ్ బాస్ తెలుగు 3 రియాల్టీ షో రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం హౌస్ నుంచి వితిక వెళ్లిపోవడంతో ఆరుగురే మిగిలారు. 13 వారాలుగా బిగ్‌బాస్ ఇంట్లో కలిసి ఉన్న వితిక-వరుణ్ జంట.. షో ఎండింగ్‌కు రెండు వారాల ముందు విడిపోయింది. బిగ్‌బాస్ ఫినాలేకు మరికొన్ని రోజులే ఉండడంతో ఈసారి టైటిల్ ఎవరు గెలుస్తారని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎవరికి వారు అనాలిసిస్ చేస్తూ విన్నర్‌ను డిసైడ్ చేస్తున్నారు. ఐతే ఆదివారం షో నుంచి ఎలిమినేట్ అయిన వితిక బిగ్ బాస్ విన్నర్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది.
బిగ్ బాస్ హౌస్‌లో వితిక, వరుణ్ జంట పరస్పరం సహకరించుకుంటూ గేమ్ ఆడారు. టాస్క్‌ల్లో వితికను గెలిపించేందుకు, నామినేషన్లోకి వెళ్లకుండా సేవ్ చేసేందుకు వరుణ్ సందేశ్ పలుసార్లు త్యాగాలు కూడా చేశాడు. హౌస్‌లో ఆమెపై ఎవరైనా నోరు జరినా..వారితో గొడవ పెట్టుకునేవాడు. ఒక విధంగా చెప్పాలంటే తన వైఫ్‌ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు వరుణ్. ఈ నేపథ్యంలో తన భర్తే బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడని వితిక చెబుతుందని అందరూ భావించారు. కానీ వరుణ్‌కు షాకిస్తూ.. రెండో ర్యాంకును కేటాయించింది అతని భార్య. తన అంచనాల ప్రకారం బిగ్ బాస్ తెలుగు 3 టైటిల్‌ను శ్రీముఖే గెలుస్తుందని అంచనా వేసింది వితిక.
ఇక రెండో స్థానంలో వరుణ్ సందేశ్ ఉంటాడని చెప్పిన వితిక.. మూడో ర్యాంకును బాబా భాస్కర్‌కు, నాలుగో స్థానాన్ని రాహుల్‌కు, ఐదో స్థానాన్ని శివజ్యోతికి, ఆరో స్థానాన్ని అలీ రెజాకు కేటాయించింది. మూడు నెలలుగా తాము ప్రెజర్ కుక్కర్లో ఉన్నట్లుగా హౌస్‌లో ఉన్నామని.. కానీ అలీ మాత్రం ఒకసారి ఇంటికి వెళ్లి వచ్చాడని చెప్పింది. అందుకే ఆయనకు ఆఖరి స్థానాన్ని ఇస్తున్నట్లు తెలిపింది. మా మ్యూజిక్‌లో వచ్చే తనిష్ ఇంటర్వ్యూలో తన అంచనాల ప్రకారం ఈ ర్యాంకులు ప్రకటించింది వితిక.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు