1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న దుబాయ్‌లోని భారత వలసదారుడు
- October 23, 2019
దుబాయ్: 56 ఏళ్ళ భారత వ్యాపారి కమలాసనన్ నాడార్ వాసు, 1 మిలియన్ డాలర్లను దుబాయ్ డ్యూటీ ఫ్రీ (డిడిఎఫ్) మిలీనియం మిలియనీర్ సిరీస్ 314 డ్రాలో గెల్చుకున్నారు. ఈ విషయమై కమలాసనన్ మాట్లాడుతూ, 33 ఏళ్ళుగా తాను స్టీల్ ఫ్యాబ్రికేషన్ కంపెనీ నిర్వహిస్తున్నాననీ, తనకు తాజాగా దక్కిన రాఫెల్ గెలుపుతో వచ్చే మొత్తంతో అప్పులన్నిటినీ తీర్చేస్తానని చెప్పారు. కొంత మొత్తంతో అప్పులు తీర్చేసి, మిగతా మొత్తంతో లైఫ్‌లో సెటిల్ అయ్యేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటానని అన్నారు. డిడిఎఫ్ డ్రాకి తాను రెగ్యులర్ కస్టమర్‌ననీ ఎనిమిదేళ్ళుగా తాను టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నాననీ, గత నెలలో కేరళ వెళుతూ కొనుగోలు చేసిన టిక్కెట్‌కి విజయం దక్కిందని చెప్పారు కమలాసనన్.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







