ప్రధాని పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు: ఇమ్రాన్ ఖాన్
- October 24, 2019
పాకిస్థాన్ : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ స్పందించారు. ప్రధాని పదవికి రాజీనామా చేసే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఉలేమా-ఏ-ఇస్లామ్ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ఈ నెల 31న ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కూడా మద్దతు పలకడంతో మీడియా మొత్తం ఇటువైపే దృష్టి సారించింది. గత ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ రిగ్గింగ్ చేసి గెలుపొందారని మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ఆరోపిస్తున్నారు. అక్రమ మార్గంలో గెలిచిన ఇమ్రాన్ కు ప్రధాని పదవిలో కొనసాగే హక్కులేదని విమర్శిస్తున్నారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ ఘాటుగా స్పందించారు. మౌలానా (ఫజ్లుర్) సమస్య ఏంటో అర్థం కావడంలేదు. ఇప్పుడు ధర్నా చేయడం ద్వారా భారత్ కు సంతోషం కలిగిస్తున్నారు. మౌలానా ధర్నా వార్తలతో భారత మీడియా సంబరాలు చేసుకుంటోంది. ఈ నిరసన ప్రదర్శన కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని పక్కకు మళ్లిస్తుంది. దీనివల్ల ఎవరికి లబ్ది చేకూరుతుందో మనం ఆలోచించాలి అని హితవు పలికారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!