దుబాయ్: రూ. పది కోట్లు కాజేసి భార్యను ఇరికించి పరార్..
- October 26, 2019
దుబాయ్: తిండి పెడుతున్న సంస్థకే ఓ వ్యక్తి కన్నం వేశాడు. దుబాయ్‌లోని ఓ స్థానిక బ్యాంకులో పనిచేస్తున్న పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి తన పరపతిని ఉపయోగించి బ్యాంకులోని వివిధ డాక్యుమెంట్లను దొంగిలించి.. వాటి ద్వారా 5.2 మిలియన్ దిర్హామ్(రూ. పది కోట్లకు పైనే)లను కాజేశాడు. 2011 నుంచి 2017 జులై వరకు నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండటంతో.. దుబాయ్ పోలీసులు నిందితుడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కాజేసిన డబ్బులో చాలా భాగం.. అతడి భార్య అకౌంట్లకే పంపినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి భార్య కూడా ఏటీఎంలలో ఆ డబ్బును విత్‌డ్రా చేయడం, చెక్కుల ద్వారా డబ్బును ఆమె అకౌంట్ల నుంచి వేరే అకౌంట్లకు పంపించడం చేస్తూ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెపై కూడా పోలీసులు కేసును నమోదు చేశారు. అయితే ఈ దోపిడీకి తనకు ఎటువంటి సంబంధం లేదని నిందితుడి భార్య కోర్టుకు తెలిపింది. తన భర్త ఏం చేస్తున్నాడనేది కూడా తనకు ఎన్నడూ చెప్పలేదని జడ్జికి వివరించింది. కాగా, కోర్టు ఈ కేసును నవంబరుకు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!