దుబాయ్ సూపర్ సేల్: 90 శాతం డిస్కౌంట్
- October 28, 2019
దుబాయ్:ఏడవ ఎడిషన్ 3 రోజుల సూపర్ సేల్ (3డిఎస్‌ఎస్), ఈ వీకెండ్‌లో షాపింగ్ ప్రియుల్ని అలరించనుంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు షాపింగ్ చేసేవారికి 90 శాతం వరకు డిస్కౌంట్‌తో ఫ్యాషన్, బ్యూటీ, గోల్డ్, హోమ్ ఎలక్ట్రానిక్స్ మరియు జ్యుయెలరీ ఐటమ్స్ దుబాయ్‌లోని పలు మాల్స్‌లో లభ్యమవుతాయి. బై యాన్యువల్ ఈవెంట్ 500కి పైగా బ్రాండ్స్‌తో సందర్శకుల్ని 2,000కి పైగా ఔట్‌లెట్స్‌లో ఆహకర్షించనున్నాయని నిర్వాహకులు తెలిపారు. దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటెయిల్ ఎస్టాబ్లిష్‌మెంట్ సీఈఓ అహ్మద్ అల్ ఖాజా మాట్లాడుతూ మూడు రోజుల సూపర్ షో, రిటెయిల్ క్యాలెండర్‌లోనే ప్రత్యేకమైనదని చెప్పారు. తమ భాగస్వాములంతా ఈ కార్యక్రమంలో భాగమవుతున్నందుకు ఆనందంగా వుందని చెప్పారు. లిమిటెడ్ టైమ్‌లో క్యాష్‌బ్యాక్ అవకాశాల్ని కూడా షాపర్స్ సొంతం చేసుకోవాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







