శిల్పాశెట్టి భర్తకు సమన్లు జారీ చేసిన ఈడీ
- October 29, 2019
ముంబై : బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్ కుంద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ మిర్చితో ఆయనకు గల సంబంధాల నేపథ్యంలో మనీలాండరింగ్ కేసులో సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసులో రాజ్ కుంద్రాను విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. దీంతో ఆయన మెడకు ఈ కేసు ఉచ్చు గట్టిగానే చుట్టుకునే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే.. మనీలాండరింగ్ కేసు సంబంధించి ముంబైలోని తమ కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా ఈడీ సోమవారం ఆదేశించింది. ముంబైలో విలువైన ఆస్తుల అమ్మకాలు, కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భావిస్తోంది. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డు చేసే అవకాశం ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్ఎల్ఏ) కింద విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!