నేడే జల్లికట్టు నిషేధం పై దాఖలైన పిటిషన్‌ విచారణ

- January 12, 2016 , by Maagulf
నేడే జల్లికట్టు నిషేధం పై దాఖలైన పిటిషన్‌ విచారణ

జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. కేంద్ర ప్రభుత్వం జల్లికట్టు నిర్వహణపై ఉన్న నిషేధాన్ని ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సంప్రదాయం పేరుతో మూగ జీవాలను హింసించడం జంతు సంరక్షణ చట్టం ప్రకారం నేరమని పిటిషన్‌లో పేర్కొన్నాయి. తమిళనాడులో పొంగల్‌ పండుగ సందర్భంగా జల్లికట్టును నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. పండుగకు సమయం ఎక్కువగా లేనందున దీనిపై త్వరగా విచారణ చేపట్టాల్సిందిగా భారత జంతు సంరక్షణ బోర్డు, పెటా, బెంగళూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నిన్న సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను స్వీకరించి... మంగళవారం విచారణ చేపడతామని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com