సైక్లోన్‌ క్యార్‌: ఒమన్‌లో కొన్ని రోడ్లు మూసివేత

- October 30, 2019 , by Maagulf
సైక్లోన్‌ క్యార్‌: ఒమన్‌లో కొన్ని రోడ్లు మూసివేత

మస్కట్‌: ఒమన్‌ నేషనల్‌ ఎమర్జన్సీ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌, కోస్టల్‌ ప్రాంతాల్లోని పలు సబ్‌ రోడ్స్‌ని తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. సైక్లోన్‌ క్యార్‌ కారణంగా ఈ రోడ్లను మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో సముద్ర కెరటాలు ఉధృతంగా ఎగసిపడుతుండడంతో, నీరు పల్లపు ప్రాంతాల్లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో కోస్టల్‌ రోడ్స్‌ని ఎవరూ వినియోగించరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వుస్టా మరియుసౌత్‌ అల్‌ షర్కియా గవర్నరేట్స్‌ పరిధిలో కొన్ని షెల్టర్లను కూడా ఏర్పాటు చేసినట్లు నేషనల్‌ సివిల్‌ డిఫెన్స్‌ కమిటీ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com