ఉక్కుమనిషికి మోడీ ఘన నివాళి..
- October 31, 2019

న్యూఢిల్లీ: ఉక్కుమనిషి, దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్‌లోని నర్మదా నది తీరాన గల పటేల్ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున సాంస్క్రతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీలోని ఆయన స్మారకం వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్, హోంమంత్రి అమిత్ షా నివాళి అర్పించారు. పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జాతీయ మైదానంలో అమిత్ షా సమైక్యత పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం పటేల్‌ను స్మరించుకున్నారు. 'సంఘటితత్త్వంతోనే శాంతి, అభివృద్ధి సాధ్యమని నమ్మి 565 గణరాజ్యాలను ఒక్కటి చేసి సువిశాల భారతదేశాన్ని నిర్మించిన ఆధునిక భారతదేశ రూపశిల్పి, ఐక్య భారత నిర్మాత సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ ఉక్కు మనిషి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







