పాకిస్తాన్ రైలులో మంటలు..షుమారు 60మంది సజీవ దహనం
- October 31, 2019
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి బయలుదేరిన తేజ్గామ్ ఎక్స్ప్రెస్లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో
షుమారు 60మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. తల్వారీ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత లియాఖత్పూర్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రైలులోని వంటగదిలో అల్పాహారం తయారుచేస్తుండగా సిలిండర్లు పేలి ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. మంటలు ఏకంగా మూడు బోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రాణనష్టం భారీ స్థాయిలో సంభవించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఇతర బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







