యూఏఈ ఫ్లాగ్ డే: జెండా ఎగురవేసేందుకు ఆన్లైన్ పోర్టల్
- October 31, 2019
యూఏఈ రెసిడెంట్స్ అలాగే వలసదారులు.. యూఏఈ జెండాని ఎక్కడినుంచైనా సగర్వంగా ఎగురవేసేందుకోసం ఓ అద్భుతమైన ఆన్లైన్ పోర్టల్ని అందుబాటులోకి తెచ్చారు. యూఏఈ ఫ్లాగ్ డే సందర్భంగా ఈ వినూత్న ప్రక్రియను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆన్లైన్ లింక్ విడుదల చేసిన వెంటనే, ఈ లింక్ సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. యూఏఈలో యూఏఈకి చెందినవారే కాకుండా, ఇతర దేశాలకు చెందినవారు సైతం యూఏఈ జెండా పట్ల అమితమైన గౌరవాభిమానాల్ని కలిగి వుంటారు అలాంటివారికి ప్రత్యక్షంగా జెండా ఎగురవేసే అవకాశం లభించకపోవచ్చు వివిధ కారణాల వల్ల అలాంటివారి కోసమే వర్చువల్గా జెండా ఎగురవేసేందుకోసం ఈ వెబ్ పోర్టల్ని రూపొందించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ఇనీషియేటివ్ని అందుబాటులోకి తెచ్చింది. 'రెయిజ్ ఇట్ హై.. రెయిస్ ఇట్ ప్రౌడ్' నినాదంతో వెబ్సైట్లో ఈ లింక్ని పొందుపరిచారు. నవంబర్ 3న ఎలక్ట్రానిక్ విధానంలో జెండా ఎగురవేసేందుకు అవకాశం దొరుకుతుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







