మాదకద్రవ్యాల స్మగ్లర్ కి మరణ శిక్ష
- October 31, 2019
కువైట్ సిటీ: కోర్ట్ ఆఫ్ కాస్సాషన్, లోవర్ కోర్టు తీర్పుని సమర్థిస్తూ ఓ కేసులో నిందితుడికి ఉరిశిక్షను ఖరారు చేసింది. నిందితుడు హెరాయిన్‌ని దేశంలోకి తెచ్చి విక్రయిస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఎరైవల్స్ హాల్ వద్ద నిందితుడ్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతని నుంచి రెండు బ్యాగ్‌లలో వున్న హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఆ డ్రగ్‌ని తీసుకొచ్చినట్లు నిందితుడి తరఫు న్యాయవాది చేసిన వాదనల్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. దేశంలో విక్రయించేందుకే స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిందితుడిపై అభియోగాలు రుజువయ్యాయి. ఈ నేపథ్యంలో నిందితుడికి న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!







