క్రైం డిటెక్టివ్ గా అంజలి
- November 01, 2019అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది . హిందీ, తమిళంలో 'సైలెన్స్' అనే పేరు పెట్టారు. తెలుగులో 'నిశ్శబ్దం' అనే పేరు నిర్ణయించారు.
తాజాగా ఈ చిత్రబృందం అంజలి లుక్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రంలో అంజలి క్రైం డిటెక్టివ్ మహా పాత్రలో కనిపించినున్నారు. అంజలి లుక్ తో ఉన్న సినిమా పోస్టర్ ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సియాటిల్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన క్రైం డిటెక్టివ్ మహా పాత్రలో అంజలి ' అని చిత్రబృందం ట్వీట్ చేసింది.
ఇందులో అనుష్క వినికిడి లోపం వున్న పాత్రలో కనిపిస్తుంది. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ