అమెరికాను వణికిస్తున్న కార్చిర్చు..
- November 02, 2019అమెరికా:కాలిఫోర్నియా కార్చిర్చు.. ఇప్పుడు ఇది అమెరికాను వణికిస్తోంది. దీని ధాటికి ఏకంగా లక్షల మందిని అమెరికా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మంటలు అదుపు చేసేందుకు భారీ సంఖ్యలో సిబ్బందిని మోహరించి ప్రయత్నిస్తోంది. ఇంత చేస్తున్నా.. కాలిఫోర్నియా అడవులను దహిస్తున్న దావానలం శాంతించడం లేదు.
కొద్ది రోజుల నుంచి అంటుకుంటున్న కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఇది రోజురోజుకు విస్తరిస్తున్నదే గానీ.. ఏమాత్రం తగ్గడం లేదు. ఈ కార్చిర్చును ఆర్పేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. హెలీకాప్టర్ల సాయంతో వేగంగా విస్తరిస్తున్న మంటలను అదుపు చేస్తున్నారు.
తాజాగా వెంచురా కౌంటీలో నివసిస్తున్న 7 వేల 500 మంది ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఉత్తర కాలిఫోర్నియాలోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చు కారణంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు కృషిచేస్తున్నారు.
ఒక్క గురువారమే 12 వేల ఎకరాల అటవీ సంపద బూడిద అయిందట. ఇప్పటి వరకూ దాదాపు 12 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపు చేసేందుకు 700 అగ్నిమాపక యంత్రాలు కృషి చేస్తున్నాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు