కువైట్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ మరియు దీపావళి సంబరాలు

- November 04, 2019 , by Maagulf
కువైట్ లో తెలంగాణ జాగృతి  ఆధ్వర్యంలో బతుకమ్మ మరియు దీపావళి సంబరాలు

కువైట్:కువైట్ దేశం లో బతుకమ్మ దసరా మరియు దీపావళి వేడకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.తెలంగాణ ఆడబిడ్డలతోపాటు ఆంధ్ర ఆడబిడ్డలు కూడా సిరిసిల్ల చీరలు ధరించి బతుకమ్మలు పేర్చి ఆడి పాడడం జరిగింది, సిరిసిల్ల చీరలు ఎంతో బాగున్నాయి అని మహిళలు ప్రశంసించారు.నేత కార్మికులకు పని కల్పించడం తో పాటు మహిళలందరికీ చీరలు పంపిణి చేస్తునందుకు కేసిర్ మరియు కేటీఆర్ కి ప్రతేక్య కృతజ్ఞతలు తెలిపారు.బతుకమ్మని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించాడనికి ముఖ్య కారణం కల్వకుంట్ల కవిత అని కొనియాడారు.ఈ సంబరాలకు ముఖ్య అతిధిగా సినిమా హీరో సంపూర్ణేష్ బాబు, తెలంగాణ జానపద గాయకులు మాట్ల తిరుపతి, పారిజాత, హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ జాగృతి అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్, జాగృతి గల్ఫ్ అధ్యక్షులు హరి ప్రసాద్, కువైట్ టీఆర్ఎస్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, మరియు కమిటీ సభ్యులు ప్రమోద్ కుమార్, సురేష్, రాజన్న మామిడిపల్లి, రాజ శేఖర్, రత్నాకర్ తదితరులు పాల్గున్నారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com