మహిళల్ని అసభ్యకరంగా ఫొటోలు తీస్తున్న వ్యక్తి అరెస్ట్‌

- November 05, 2019 , by Maagulf
మహిళల్ని అసభ్యకరంగా ఫొటోలు తీస్తున్న వ్యక్తి అరెస్ట్‌

కువైట్‌ సిటీ: పబ్లిక్‌ ప్రాంతాల్లో మహిళల్ని చాటు మాటుగా గమనిస్తూ, వారి ఫొటోల్ని అసభ్యకరంగా తీస్తోన్న వ్యక్తిని సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌ అరెస్ట్‌ చేసింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి చెందిన సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌, నిందితుడ్ని అత్యంత చాకచక్యంగా గుర్తించగలిగింది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు, నిందుతుడ్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌ అతి తక్కవ సమయంలోనే అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు మహిళల్ని చాటుమాటుగా గమనిస్తూ, వారి ఫొటోలు తీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఓ కువైటీ మహిళ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com