బహ్రెయిన్ డ్రీమ్ డెస్టినేషన్‌గా మార్చుతున్నాం
- January 12, 2016
బహ్రెయిన్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఇడిబి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఖాలిద్ అల్ రుమైహి ఇటీవల బహ్రెయిన్‌లో తగ్గించిన సబ్సిడీలపై స్పందించారు. దేశ అభివృద్ధికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా బహ్రెయిన్ సమర్థవంతంగా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తోందని ఆయన అన్నారు. బహ్రెయిన్ ఆదాయంలో టూరిజం నుంచి వచ్చే భాగం ఎక్కువన్న ఖాలిద్, గత ఏడాది 10 మిలియన్ టూరిస్టులు బహ్రెయిన్‌లో పర్యటించారని ఆయన చెప్పారు. బహ్రెయిన్ ఇంకా అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి పలు ప్రాజెక్టులు చేపడుతున్నామనీ, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను బహ్రెయిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని ఆయన వివరించారు. దేశం కోసం ఇడిబి అవిశ్రాంతంగా కృషి చేస్తుందని ఖాలిద్ కొనియాడారు. బహ్రెయిన్ ఇండియా సొసైటీ ఛైర్మన్ మహమ్మద్ దాదాభాయ్ బహ్రెయిన్ నాయకత్వాన్ని అభినందించారు. బహ్రెయిన్ ఇండియా సొసైటీ, ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుందని, ఇండియాతో కింగ్‌డమ్ రిలేషన్ ఇంకా బలపడుతుందని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







