'భారతీయుడు' లుక్ విడుదల

- November 09, 2019 , by Maagulf
'భారతీయుడు' లుక్ విడుదల

దక్షిణాది సినీ చరిత్రలో మైలురాయిలా నిలిచిన చిత్రాల్లో 'భారతీయుడు' ఒకటి. ఈ సినిమా వచ్చిన ఇరవై ఏళ్లకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతుండటం విశేషమే. పదేళ్లుగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్న శంకర్.. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. సినిమా చిత్రీకరణ మొదలయ్యాక కొన్ని ఇబ్బందులు తలెత్తి దీన్ని ఆపేస్తున్నట్లుగా వార్తలొచ్చినా.. అ అడ్డంకుల్ని అధిగమించి మళ్లీ సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చాడు శంకర్. కొన్ని రోజులుగా నిర్విరామంగా చిత్రీకరణ సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో కమల్ లుక్ కొద్ది కొద్దిగా బయటికి వచ్చింది. ఇప్పుడు గురువారం కమల్ పుట్టిన రోజు సందర్భంగా కమల్‌ను నేరుగా చూపించకుండా వెనుక నుంచి 'భారతీయుడు'ను చూపిస్తూ ఒక లుక్ రిలీజ్ చేసి లోకనాయకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు శంకర్.ఈ కొత్త పోస్టర్ చూసిన కమల్ ఫ్యాన్స్‌కు, 'భారతీయుడు' అభిమానులకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక పెద్ద కోట లాంటి నిర్మాణంలో నుంచి నగరాన్ని తీక్షణంగా చూస్తున్నాడు భారతీయుడు ఇందులో. కమల్ ఈ చిత్రంలో 90 ఏళ్ల వృద్ధుడిగా కనిపించనున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. ఆయన నిలబడ్డ తీరు మాత్రం కుర్రాడిలా ఉంది. ఈ విషయంలో శంకర్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటాడనడంలో సందేహం లేదు.

దక్షిణాదిన సీక్వెల్స్ అంతగా అచ్చిరాని నేపథ్యంలో శంకర్ ఎలా అంచనాల్ని అందుకుంటాడన్నది ఆసక్తికరం. '2.0' చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ వాళ్లే ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. రకుల్ ప్రీత్ ఓ కీలక పాత్ర చేస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంగీతాన్నందిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com