మొత్తానికి పునర్నవి పై మనసులో మాటను బయటపెట్టిన రాహుల్
- November 11, 2019'బిగ్ బాస్ 3' విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ పెద్దగా టాస్క్ లు ఆడకపోయినా, అంతా తన గురించి మాట్లాడుకునేలా చేయగలిగాడు. నటి పునర్నవి .. సింగర్ రాహుల్ మధ్య నడిచిన కొన్ని ఎపిసోడ్స్, వాళ్లిద్దరి మధ్య ఏదో జరుగుతోందనే భావనను కలిగించాయి. వాళ్లిద్దరూ నిజంగానే ప్రేమించుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది. తనకి ఆల్రెడీ వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనీ పునర్నవి, తమ మధ్య స్నేహం మాత్రమే ఉందని రాహుల్ చెప్పినా బయట వినిపించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలతో రాహుల్ బిజీ అయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'పునర్నవితో కలిసి సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తావా?' అని అంతా అడుగుతున్నారు. నిజంగా అలాంటి ఛాన్స్ వస్తే ఎంతమాత్రం వదులుకోను" అని రాహుల్ తన మనసులోని మాటను చెప్పాడు. మరి ఈ జంటకు ఆ ఛాన్స్ తగులుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!