అమెరికా: చీటింగ్ కేసు లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురికి జైలుశిక్ష
- November 11, 2019
ఫార్మింగ్టన్ యూనివర్సిటీ ఛీటింగ్ కేసులో ఆరుగురు తెలుగువాళ్లను అమెరికా కోర్టు దోషులుగా తేల్చి శిక్ష విధించింది. ఇమిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించి దొంగపత్రాలు సృష్టించిన ఈ ఆరుగురికి 2 ఏళ్ల నుంచి ఏడాది వరకూ శిక్షలు పడ్డాయి. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్‌మెంట్ 2017నుంచి ఫార్మింగ్టన్ మిచిగాన్ యూనివర్శిటీ పేరుతో అక్రమంగా వీసాలు జరీ చేస్తున్నవారిపై నిఘా పెట్టింది. అండర్ కవర్ ఆపరేషన్ వలలో చిక్కుకున్నారు తెలుగువారు. దీనిపై విచారణ కొలిక్కిరావడంతో దోషులకు శిక్షలు ఖరారు చేసింది.
ఈ కేసులో ఫ్రీమెంట్‌కు చెందిన సామ సంతోష్‌కు 24నెలలు, సురేష్ కందాల, కాకిరెడ్డి భరత్‌లకు 18 నెలలు శిక్ష పడింది. తక్కెళ్లపల్లి అవినాష్‌కు 15 నెలలు, అశ్వంత్ , నవీన్ ప్రత్తిపాటిలకు 12నెలల చొప్పున జైల్లో ఉండాలి. మొత్తం ఎనిమిదిమందిని దోషులుగా గుర్తించిన కోర్టు మరో ఇద్దరికి శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. వీరందరి శిక్షా కాలం ముగిసిన తర్వాత ఇండియాకు తిప్పి పంపనున్నారు.
జనవరి నెలలో ఈ కేసులో మొత్తం 179 మంది భారతీయ విద్యార్ధులను అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ అదుపులోకి తీసుకుంది. సరైన పత్రాలు, కోర్స్ వివరాలు లేకుండా అమెరికాకు అక్రమంగా వచ్చినట్టు గుర్తించారు. వీరికి అడ్మిషన్లు ఇప్పించిన కన్సల్టెంట్లను గుర్తించి అరెస్టు చేశారు. విద్యార్ధులకు తిరిగి ఇండియాకు పంపారు. మొత్తం ఎనిమిది మంది భారతీయ విద్యార్ధులను రిక్రూట్ చేసినట్టు తేల్చారు. ఫిబ్రవరి 2017 నుంచి జనవరి 2019 మధ్య అక్రమాలు జరిగినట్టు గుర్తించారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!