అమెరికాలోని భారతీయ జంటలకు ఊరట..

- November 11, 2019 , by Maagulf
అమెరికాలోని భారతీయ జంటలకు ఊరట..

అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులకు అక్కడి కోర్టు తీర్పు తాత్కాలిక ఊరటనిచ్చింది. వారికి ఉపశమనం కలిగిస్తూ అక్కడ కోర్టు శుభవార్త అందించింది. అమెరికా కోర్టు హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు ఊరట కలిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌1బీ వీసాదారుల భార్యలకు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలని ట్రంప్ సర్కారు ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశించింది.

వాస్తవానికి భారతీయ మహిళలకు ఉద్యోగాలు చేసుకునే విషయంలో పలు వెసులుబాట్లు కల్పిస్తూ గతంలో ఒబామా సర్కారు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఇదే క్రమంలో... హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు ఉద్యోగాల కల్పన విషయంలో... అమెరికా కార్మికుల డిమాండ్ నేపధ్యంలో ట్రంప్ సర్కారు నిబంధనలను కఠినతరం చేసంది. ఈ చర్యలను సవాలు చేస్తూ అమెరికా కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి.

దీంతో విచారణం చేప్పట్టిన కోర్టు ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ముగ్గురు న్యాయమూర్తుల యూఎస్ కోర్ట్సు ఆఫ్ అప్పీల్ కొలంబియా సర్క్యూట్ దిగువ కోర్చును కోరింది. నిబధనల్ని క్షుణ్ణం గా పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని ఆదేశించింది. అప్పటి వరకు నిబంధనలు నిలుపుదల చేయటం మంచిదని అభిప్రాయం వ్యక్తంచేసింది. అలాగే తుది తీర్పును కూడా నిలిపి వేయాలని కోరింది. దీంతో వేలాది మంది భారతీయులకు తాత్కాలిక ఉపశమనం లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com