డ్రైవ్ త్రూ ఫ్యూయల్ స్టేషన్ సర్వీస్‌ని ప్రారంభించిన అడ్నాక్
- November 11, 2019
అబుదాబీకి చెందిన అడ్నాక్ గ్రూప్, యూఏఈలో డ్రైవ్ త్రూ ఫ్యూయల్ స్టేషన్ సర్వీస్‌ని ప్రారంభించింది. 'ఆన్ ది గో' పేరుతో రూపొందించిన ఈ సర్వీస్ ద్వారా, తమ కారు నుంచే కంఫర్టబుల్‌గా ఫ్యూయల్ ప్రోడక్ట్స్ చేయవచ్చు. ఈ కొత్త సర్వీసు కాంప్లిమెంటరీగా లభిస్తుందనీ, ఎలాంటి అదనపు ఛార్జీలూ వసూలు చేయబోమని సంస్థ పేర్కొంది. అడ్నాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జబెర్ మాట్లాడుతూ, వినియోగదారులకు క్వాలిటీ సర్వీసుల్ని అందించే క్రమంలో ఈ కొత్త కార్యక్రమం చేపట్టామని అన్నారు. మోటరిస్ట్ అడ్నాక్ ఒయాసిస్ స్టోర్ వద్ద ఆగి వెహికిల్ దిగకుండానే, అందులో ఫ్యూయల్ ఫిల్ చేసే సమయంలో షాపింగ్ చేసుకోవచ్చు. వైఫై పేమెంట్ మెథడ్ ద్వారా ఈ సౌకర్యం పొందే వీలుంది.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







