డ్రైవ్‌ త్రూ ఫ్యూయల్‌ స్టేషన్‌ సర్వీస్‌ని ప్రారంభించిన అడ్‌నాక్‌

- November 11, 2019 , by Maagulf
డ్రైవ్‌ త్రూ ఫ్యూయల్‌ స్టేషన్‌ సర్వీస్‌ని ప్రారంభించిన అడ్‌నాక్‌

అబుదాబీకి చెందిన అడ్‌నాక్‌ గ్రూప్‌, యూఏఈలో డ్రైవ్‌ త్రూ ఫ్యూయల్‌ స్టేషన్‌ సర్వీస్‌ని ప్రారంభించింది. 'ఆన్‌ ది గో' పేరుతో రూపొందించిన ఈ సర్వీస్‌ ద్వారా, తమ కారు నుంచే కంఫర్టబుల్‌గా ఫ్యూయల్‌ ప్రోడక్ట్స్‌ చేయవచ్చు. ఈ కొత్త సర్వీసు కాంప్లిమెంటరీగా లభిస్తుందనీ, ఎలాంటి అదనపు ఛార్జీలూ వసూలు చేయబోమని సంస్థ పేర్కొంది. అడ్‌నాక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుల్తాన్‌ అహ్మద్‌ అల్‌ జబెర్‌ మాట్లాడుతూ, వినియోగదారులకు క్వాలిటీ సర్వీసుల్ని అందించే క్రమంలో ఈ కొత్త కార్యక్రమం చేపట్టామని అన్నారు. మోటరిస్ట్‌ అడ్‌నాక్‌ ఒయాసిస్‌ స్టోర్‌ వద్ద ఆగి వెహికిల్‌ దిగకుండానే, అందులో ఫ్యూయల్‌ ఫిల్‌ చేసే సమయంలో షాపింగ్‌ చేసుకోవచ్చు. వైఫై పేమెంట్‌ మెథడ్‌ ద్వారా ఈ సౌకర్యం పొందే వీలుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com