హాస్పటల్ లో చేరిన కృష్ణంరాజు..
- November 14, 2019
రెబల్ స్టార్ , కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన చికిత్స కోసం బుధవారం రాత్రి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ చెపుతున్నారు. కానీ అభిమానుల్లో మాత్రం ఆందోళన నెలకొని ఉంది..కుటుంబ సభ్యులెవరైనా ఆయన ఆరోగ్యం గురించి తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణం రాజు వయసు 79 ఏళ్లు. రెండు రోజులుగా హైదరాబాద్ లో వాతావరణం మారడడం తో ఈయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మాత్రమే పాల్గొంటూ వస్తున్నారు. ఓవైపు పాలిటిక్స్ లో కొనసాగుతూనే, మరోవైపు ప్రభాస్ తో ఓ సినిమా నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ తో కలిసి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ బ్యానర్ పై ఓ సినిమా నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







