ఎంజీఆర్ గా మారిన అరవింద్ స్వామి
- November 15, 2019
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ 'తలైవి' టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తుండగా ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. ఇక కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమాలు పూర్తీ అయ్యాయి.
దీంతో సినిమాలోని ఒక్కో పాత్ర తాలూకా మేకోవర్ బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా గా ఈ మూవీ లో ఎం.జి.రామచంద్రన్ పాత్ర చేస్తున్న అరవింద్ మేకోవర్ కోసం అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్న వేళా ఆయన తాలూకా పిక్ బయటకొచ్చి అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. అచ్చం అప్పట్లో ఎంజీఆర్ ఎలాగైతే క్లీన్ షేవ్ చేసుకుని ఉండేవారో అలాగే ఉన్నారు అరవింద్ స్వామి.
'బాహుబలి' రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రానికి నిరవ్ షా సినిమాటోగ్రఫీ చేయనుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో 'తలైవి'గా వస్తున్న ఈ చిత్రం హిందీలో 'జయ' పేరుతో విడుదలకానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..