జబాల్‌ షామ్స్‌లో స్నో ఫాల్‌

- November 15, 2019 , by Maagulf
జబాల్‌ షామ్స్‌లో స్నో ఫాల్‌

మస్కట్‌: గతంలో ఎన్నడూ లేని విదంగా ఈసారి జబాల్‌ సామ్స్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు చాలా ముందుగానే 5 డిగ్రీల లోపుకు పడిపోయాయి. ఒమన్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం అల్‌ హమ్రా ప్రాంతంలోని జబాల్‌ షామ్స్‌లో అత్యల్పంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. జబాల్‌ సామ్స్‌లో నివసించే అబు టుకి అల్‌ ఖాత్రి మాట్లాడుతూ, ఉదయం వేళల్లో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా భారీ స్థాయిలో మంచు కురుస్తోందని చెప్పారు. మంచు కురుస్తుండడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com