వీధుల్లో వేధిస్తే... షార్జాలో జరిమానాలు
- January 13, 2016
తమ దుకాణాల్లో కొనమని వీధుల్లో వినియోగదారులను వెంటబడి వేధిస్తే , అటువంటి వ్యాపారస్తులపై షార్జా మునిసిపాలిటి జరిమానాలను విధించనుంది. వినియోగాదారులనే కాక, ఆ వీధుల్లో వెళ్ళే సాధారణ పౌరులను సైతం వదలక తమ గుమాస్తాలతో సతాయించేవారిపై సైతం ఇక చర్యలు తీసుకోనున్నారు. జరిమానాను 500 దినార్లగా నిర్ణయించారు. ఇదే తప్పును మరల పునరావృతం చేసిన వ్యాపారులకు అదే జరిమానా రెట్టింపు కానుంది. కొందఱు వ్యాపారులు చేస్తున్న ఈ తంతు విషయమై పలువురు వినియోగదారులు షార్జా మునిసిపాలిటి అధికారులకు పలు పిర్యాదులు ఇచ్చారు.ఇందుకు స్పందించిన షార్జా కేంద్ర మార్కెట్ విభాగాధిపతి ఆబ్దుల్లహ్ ఎబ్రహిం హస్సన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ' ఖలీజ్ టైమ్స్ ' తో మాట్లాడుతూ, వినియోగదారులకు మార్కెట్లో ఏమేమీ
కొనుక్కోవాలో తెలుసునని...వారిని వ్యాపారస్తులు తమ ఉత్పతిని కొనమని , తమ వద్ద ఉన్న వస్తువు ఎంతో మంచిదని నమ్మబలకతు వేధించడం ఏ మాత్రం తగదని ఆయన వ్యాపారులను హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







