స్మార్ట్ ఫ్యాక్టరీలపై రియాద్ ఫోరంలో చర్చ
- November 15, 2019
రియాద్: ఇండస్ట్రీ మరియు మ్యాన్యుఫ్యాక్చరింగ్ విభాగాల్లో వస్తున్న మార్పులపై రియాద్ ఫోరంలో కీలక చర్చ జరగనుంది. సౌదీ అథారిటీ ఫర్ ఇండస్ట్రియల్ సిటీస్ అండ్ టెక్నాలజీ జోన్స్ ఇన్ రియాద్ ఈ ఫోరమ్‌ని నిర్వహిస్తోంది. 19కి పైగా రీజినల్, అంతర్జాతీయ గ్రూప్‌లు ఈ వేదికపై 'స్మార్ట్ ఫ్యాక్టరీస్'కి సంబంధించి తమ అభిప్రాయాల్ని పంచుకోనున్నాయి. విజన్ 2030లో భాగంగా సౌదీ అరేబియా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని 100 ఫ్యాక్టరీల్లో తొలుత ప్రవేశపెట్టనున్నారు. ఇండస్ట్రీ 4.0 రివల్యూషన్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నామనీ, మొత్తం 100 ఫ్యాక్టరీల్లో 20 ఫ్యాక్టరీలు జనరల్ ఎలక్ట్రిక్ సహకారంతో ముందుకు వెళుతున్నాయనీ, మరో 80 ఫ్యాక్టరీలు త్వరలో లాంఛ్ అవుతాయని అథారిటీ మార్కెటింగ్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ బందర్ అల్ తవోమి చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!