రెక్లెస్ డ్రైవింగ్: పోలీస్ ఆఫీసర్ మృతి
- November 16, 2019
అబుదాబీ పోలీస్‌కి చెందిన ఓ ట్రాఫిక్ ఆఫీసర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అల్ అయిన్‌లో ఓ రెక్లెస్ డ్రైవర్ కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ పెట్రోల్ వాహనంలో సర్జంట్ అలీ సయీద్ ఖర్బాష్ అల్ సాది వుండగా, ఓ వ్యక్తి అతి వేగంతో వాహనాన్ని పెట్రోల్ వాహనంపైకి తీసుకెళ్ళడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆ క్షణంలో పోలీస్ అధికారి హల్లామి టన్నెల్ వద్ద ట్రాఫిక్ని నియంత్రిస్తున్నారు. ప్రమాదంలో అక్కడికక్కడే ఆ అధికారి ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ అధికారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అబుదాబీ పోలీస్ డిపార్ట్మెంట్. మృతుడు అల్ సాది చాలా కమిటెడ్ అధికారి అని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!