బహ్రెయిన్ లో BJP కోర్ కమిటీ ఏర్పాటు
- November 17, 2019
బహ్రెయిన్:బహ్రెయిన్ లో భారతీయ జనతా పార్టీ శాఖ ను ప్రారంభించారు 15 నవంబర్ శుక్రవారం రోజున కలవర హోటల్ మనమా లో డాక్టర్ వెంకట్ రెడ్డి, అలె గంగాధర్, ప్రేమ్ సాగర్ వెంక్కట స్వామి కిరణ్ విట్ఠల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సహాకారంతో బాహారాయిన్ లో కోర్ కమిటీ ఏర్పాటు చేశామని కో-కన్వీనర్ అలె గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్దఎత్తున హాజరైయ్యారు. తెలంగాణలో 2024 లక్ష్యంగా కాషాయ జండా రెప రెపలాడే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కమిటీ సహాయ సహకారాలు అందిస్తుందని కన్వీనర్ డాక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు.అదే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల యొక్క సమస్య ల పరిష్కారానికి తోడుగా ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవ భారత్ జెనరల్ సెక్రెటరీ ప్రదీప్ హాజరైనారు . కమిటీ సభ్యులు కన్వీనర్ డాక్టర్ వెంకట్, కో-కన్వీనర్ అలె గంగాధర్, వెంకటస్వామి, ప్రేమసాగర్ గుప్తా, విట్ఠల్, కిరణ్ మోహన్ రెడ్డి, నర్సా గౌడ్,వేణు తదితరులు పాల్గొన్నారు. మీడియా కోఆర్డినేటర్ గా గంగుల సుదర్శన్ పాల్గొన్నారు.
-- రాజేశ్వర్ గౌడ్, మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..