ఛార్థామ్ యాత్ర సీజన్ ముగిసింది
- November 18, 2019
డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): చలికాలం సందర్భంగా హిమాలయాల్లో మంచు అధికంగా కురుస్తుండటంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్‌లో ఉన్న ఛార్థామ్ దేవాలయాన్ని ఆదివారం సాయంత్రం మూసివేశారు. బద్రీనాథ్ దేవాలయంలో సంప్రదాయ బద్ధంగా పూజలు చేసిన అనంతరం ఆలయాన్ని మూసివేస్తున్నట్లు బద్రీనాథ్ -కేదార్నాథ్ మందిర సమితి ప్రకటించింది. ప్రతి ఏటా అక్టోబరు- నవంబరు నెలల్లో భారీగా మంచుకురుస్తుండటంతో హిమాలయాల్లోని బద్రీనాథ్ దేవాలయాన్ని మూసివేస్తుంటారు. వేసవికాలం సమీపించాక ఏప్రిల్-మే నెల్లో మళ్లీ బద్రీనాథ్ ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. ఇప్పటికే హిమాలయాల్లో మంచు విస్తారంగా కురుస్తుండటంతో కేదార్నాథ్, గంగోత్రీ, యమునోత్రి దేవాలయాలను ఇప్పటికే మూసివేశారు. బద్రీనాథ్ ఆలయాల మూసివేతతో ఛార్థామ్ యాత్ర సీజన్ ముగిసింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..